కడప ఎన్నికలలో 5గురు జగన్‌లు: అధికార కాంగ్రెసు వ్యూహం?

అయితే వైయస్ మరణం తర్వాత జగన్ పార్టీని వీడిపోవడంతో కాంగ్రెసు అక్కడ తమ పట్టు కోల్పోకుండా ఉండే ప్రయత్నాలు చేస్తోంది. జిల్లా ప్రజలు కాంగ్రెసుతోనే ఉన్నారన్న ఉద్దేశ్యాన్ని రాష్ట్రంలో కల్పించడానికి ప్రభుత్వానికి ఈ ఉప ఎన్నికలు సవాలుగా నిలిచాయి. అయితే జగన్ బాబాయి వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి కాంగ్రెసు వైపే ఉండటం కాస్త కాంగ్రెసుకు లాభం చేకూర్చే విషయమే అయినప్పటికీ శాసనమండలి ఎన్నికలలో ఓటమితో మరింత పకడ్బందీగా కడప పార్లమెంటునుండి జగన్‌ను, పులివెందులనుండి విజయమ్మను ఓడించేందుకు కాంగ్రెసు వ్యూహం రచిస్తున్నట్టుగా తెలుస్తోంది.
జగన్‌ను ఓడించడానికి కాంగ్రెసు అభ్యర్థితో పాటు మరో నలుగురిని బరిలోకి దింపడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకు కాంగ్రెసు నేతలు ఆ నియోజకవర్గంలో జగన్ పేరుతో ఉన్న వారి కోసం సెర్చ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. జగన్ పేరుతో ఉన్న వారిని మరో నలుగురిని బరిలోకి దింపి ఓటర్లను గందరగోళ పరిస్థితిలోకి నెట్టే ఉద్దేశ్యంలో అధికార కాంగ్రెసు ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో జగన్‌కు పడే ఓట్లలో కొన్నింటిని అయినా చీల్చవచ్చని, దాని ద్వారా లాభపడవచ్చునని అధికార పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే కాంగ్రెసు, జగన్ వ్యూహ ప్రతివ్యూహాలలో ఎవరి వ్యూహం బెడిసి కొడుతుందో లేక వీరిద్దరి వ్యూహాల మధ్య టిడిపి లాభ పడుతుందో ఎన్నికల అనంతరం తెలుస్తుంది.












Click it and Unblock the Notifications