కెసిఆర్ నమస్తే తెలంగాణ జపం, కార్యకర్తలకు పత్రిక టార్గెట్లు

తెలంగాణ వాయిస్‌గా చెబుతున్న నమస్తే తెలంగాణ పత్రిక ఏప్రిల్ చివరి వారంలో గానీ మే మొదటి వారంలో గానీ మార్కెట్లోకి రావచ్చునని అంటున్నారు. ఆ పత్రిక తెలంగాణ గుండె చప్పుడు అనే స్లగ్ ఇస్తున్నారు. తెలంగాణలోని పది జిల్లాల్లో ఒకేసారి కాకుండా తొలుత ఏడు జిల్లాల్లోకి ఈ పత్రిక వెళ్తుందట. క్రమంగా దాన్ని పది జిల్లాలకు విస్తరిస్తారని అంటున్నారు. పత్రిక సర్క్యులేషన్ పెంచాలని ఆదేశిస్తూ కెసిఆర్ మండల స్థాయి వరకు పార్టీ నాయకులందరికీ లేఖలు రాశారు. పత్రిక సర్క్యులేషన్ పెంచే బాధ్యతను ఆయన పార్టీ నాయకులపై పెడుతున్నారు.