తెరాస నేత సాంబశివుడి హత్య నయీం ముఠా పనే: ఎస్‌పి

సాంబశివుడి హత్యలో పాల్గొన్న నయీంతో పాటు మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆధిపత్య పోరులోనే సాంబశివుడు హత్యకు గురైనట్లు ఆయన తెలిపారు. నయీంకు, సాంబశివుడికి మధ్య పాతకక్షలున్నాయని, వారిద్దరి మధ్య ఆధిపత్య పోరు సాగుతోందని ఆయన అన్నారు. సాంబశివుడి హత్యకు నయీం ముఠా పలు మార్లు రెక్కీ నిర్వహించిందని, హైదరాబాదులోని ఎల్బీ నగర్ ధూంధాం కార్యక్రమంలో కూడా రెక్కీ నిర్వహించారని ఆయన వివరించారు. సాంబశివుడి హత్య కేసులో ప్రధాన నిందితుడు నయీమేనని ఆయన చెప్పారు.
సాంబశివుడి హత్య కోసం ఐదు లక్షల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు. నిందితులు రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు చెందినవారని ఆయన చెప్పారు. పది రోజుల్లో సాంబశివుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. సాంబశివుడిని తామే హత్య చేశామని ఇటీవల కొంత మంది లొంగిపోయారు. వారిని ఈ కేసులో పోలీసులు చూపించలేదు. వారికి సంబంధించి విచారణ జరుగుతోంది. సాంబశివుడి హత్యకు ఈ ఏడాది జనవరిలోనే కుట్ర చేశారని ఎస్పీ చెప్పారు.












Click it and Unblock the Notifications