జగన్ వైఖరి చెప్పాలి, సిఎంను ప్రజలు సహించరు: జీవన్ రెడ్డి
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోన్ రెడ్డి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై తన వైఖరి చెప్పాలని కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు జీవన్‌రెడ్డి బుధవారం అన్నారు. జగన్ పార్టీ పెట్టాడు కనుక ఇప్పుడు తెలంగాణపై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజీనామాను ఉప సభాపతి నాదెండ్ల మనోహర్ ఆమోదించాలని జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానం నిర్ణయం ప్రకారం నడుచుకుంటానని చెబుతూనే వ్యతిరేకంగా నడుస్తున్నాడని ఆరోపించారు. అధిష్టానానికి అనుకూలంగా ఉంటానని చెబుతూ తెలంగాణకు వ్యతిరేకంగా ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రిని సహించరని అన్నారు.
Congress senior leader Jeevan Reddy questioned Ex MP YS Jaganmohan Reddy about Telangana. He blamed CM Kiran Kumar Reddy for Telangana issue. He suggested government to accept Pocharam Srinivas Reddy resignation.
Story first published: Wednesday, April 6, 2011, 14:45 [IST]