సత్యసాయి ట్రస్టు వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకోదు: రఘవీరా
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: సత్యసాయి ట్రస్ట్ వ్యవహారాల్లో ప్రభుత్వం ఎంతమాత్రమూ జోక్యం చేసుకోదని మంత్రి రఘువీరారెడ్డి బుధవారం చెప్పారు. ట్రస్టును ప్రభుత్వం ఆదీనం తీసుకు రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వస్తున్న ఆరోపణలలో ఎలాంటి నిజం లేదన్నారు. అవన్నీ అవాస్తవమైన ఆరోపణలు అని చెప్పారు. ట్రస్టు వ్యవహారాలపై ప్రభుత్వం దృష్టి పెడుతుందన్న వార్తలను ఆయన ఖండించారు. ట్రస్టు వ్యవహారలపై దృష్టి సారించడానికి ఐదుగురు సభ్యుల బృందాన్ని పంపిన వార్తలను కూడా ఆయన కొట్టిపారేశారు.
ట్రస్టు స్వాధీనం ప్రయత్నంలో భాగంగా ఎవరినీ అక్కడకు పంపించలేదన్నారు. భగవాన్ సత్యసాయి ఆరోగ్యం కోసం అక్కడి వైద్యులకు సాయం అందించే ఉద్దేశ్యంతో హెల్త్ సెక్రటరీ రమేష్‌ను సహాయకుడిగా పంపించామని చెప్పారు. ఐఏఎస్ సుబ్రహ్మణ్యంను కూడా అక్కడ ట్రస్టు వారికి సహాయ సహకారాలు అందించడానికి పంపించామని చెప్పారు.
Minister Raghuveera Reddy condemned government interfere in Satya Sai Trust. He said government send health secretary Ramesh to co-operate them, and IAS officer Subrahmanyam to help trust.
Story first published: Wednesday, April 6, 2011, 14:53 [IST]