జనసేన నుంచి రాజ్యసభ అభ్యర్ధి ఫిక్స్, పవన్ అనూహ్య ఎంపిక..!!

ఏపీలో రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిక కసరత్తు కొలిక్కి వచ్చింది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నాలుగు స్థానాలు కూటమికే దక్కనున్నాయి. ఈ సీట్ల ఖరారు పైన సీఎం చంద్రబాబు ఎన్డీఏ నేతల తో సమావేశం అయ్యారు. టీడీపీకి మూడు స్థానాలు.. జనసేనకు ఒక సీటు ఇచ్చేలా అంగీకారం కుది రింది. అదే విధంగా 2029 ఎన్నికల లోగా జనసేనకు మరో రెండు స్థానాలు దక్కనున్నాయి. ఈ సారి జనసేన నుంచి రాజ్యసభ అభ్యర్ధి ఎంపిక పై పవన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాల పైన స్పష్టత వస్తోంది. టీడీపీ నుంచి ముగ్గురు.. జనసేన నుంచి ఒకరు రాజ్యసభకు ఎంపిక కానున్నారు. సామాజిక లెక్కలు.. ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా వీరి ఎంపిక జరుగుతోంది. జనసేన నుంచి పలువురు ఆశావాహులు ఉన్నారు. అయితే, 2029 ఎన్నికల్లోకా జనసేన కు మూడు రాజ్యసభ స్థానాలు ఇచ్చేలా ఒప్పందం జరిగింది. 2024 ఎన్నికల సమయంలో జనసేన తమకు కేటాయించిన లోక్ సభ సీట్లను చివరి నిమిషంలో త్యాగం చేయాల్సి వచ్చింది. ఫలితంగా రాజ్యసభ స్థానాల పైన హామీ దక్కింది. ప్రస్తుతం జనసేన కు ఒక సీటు దక్కుతోంది. దీని ద్వారా తొలి సారి రాజ్యసభలో జనసేన ప్రాతినిధ్యం దక్కనుంది. కాగా, పవన్ తమ పార్టీ నుంచి రాజ్యసభకు అభ్యర్ధి ఖరారు విషయంలో అచి తూచి వ్యవహరిస్తున్నారు.

లిక్కర్ కేసులో జగన్ కు నోటీసులు, అనూహ్య మలుపు..!?
లిక్కర్ కేసులో జగన్ కు నోటీసులు, అనూహ్య మలుపు..!?
janasena-chief-pawan-kalyan-likely-to-nominate-lingamaneni-ramesh-for-rajyasabha-as-latest-reports

జనసేన నుంచి ఆ ఇద్దరులో ఒకరు ఫిక్స్

జనసేన నుంచి రాజ్యసభ స్థానం ప్రముఖ పారిశ్రామిక వేత్త లింగమేనని రమేశ్ కు కేటాయిస్తారని చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే, కూటమి నుంచి ఎంపిక చేసే నాలుగు స్థానాల్లో సామాజిక లెక్కలు కీలకంగా మారనున్నాయి. దీంతో.. లింగమనేనితో పాటుగా మెగా బ్రదర్ నాగబాబు, బండారు నరసింహా రావు.. మరో సినీ ప్రముఖుడు పేర్లు జనసేన నుంచి పరిశీలనలో ఉన్నాయి. వీరిలో ఈ సారి లింగమనేనికి దాదాపు ఖరారు అని చెబుతున్నారు. అదే సమయంలో చివరి నిమిషంలో లెక్కలు మారితే.. నాగబాబును తమ పార్టీ తొలి రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేసే అవకాశం కనిపిస్తోంది. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని చెప్పినా.. ఇప్పటి వరకు సాధ్య పడలేదు. నాగబాబును ఢిల్లీ పంపేందుకే పెండింగ్ లో పెట్టారనే అభిప్రాయం ఉంది. దీంతో.. లింగమేనని లేదా నాగబాబులో ఒకరికి జనసేన రాజ్యసభ స్థానం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+