జగన్ అవినీతిపరుడు, ప్రజలు గుణపాఠం చెబుతారు: మైసూరా రెడ్డి

Mysoora Reddy
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి హయాంలో భారీగా అవినీతికి పాల్పడ్డారని తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంటు అభ్యర్థి ఎం.వి.మైసూరా రెడ్డి శుక్రవారం ఆరోపించారు. జగన్ తన అవినీతి సొమ్ముతో ఎన్నికల బరిలోకి దిగుతున్నారని అన్నారు. జగన్ చేసిన అవినీతి కారణంగా ప్రజలు ఆయనకు ఈ ఉప ఎన్నికలలో ప్రజలు గుణపాఠం చెప్పక తప్పదన్నారు.

తాను పోటీ చేస్తున్న కడప పార్లమెంటులో శాసనసభ్యులకు బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. పులివెందుల, కడప రెండింటిలోను తెలుగుదేశం పార్టీ తప్పకుండా గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఈ నెల 18వ తారీఖున మైసూరా రెడ్డి పార్లమెంటు అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. నామినేషన్‌కు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కూడా హాజరవనున్నారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+