అన్నాహజారేకు రాష్ట్రవ్యాప్తంగా మద్దతు: సమాజం మారాలంటున్న యువత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా అన్నా దీక్షకు మద్దతు ప్రకటించారు. మేధాపట్కర్ హైదరాబాదులో జల విహార్ నుండి ర్యాలీ ప్రారంభించారు. ఇవ్వాళ రేపు రాష్ట్ర వ్యాప్తంగా లోక్‌సత్తా ఆధ్వర్యంలో సామూహిక సత్యాగ్రహాలు చేపడుతున్నారు. కెబిఆర్ పార్కులో పలువురు వాకర్స్ గాంధీ టోపీలు ధరించి వాకౌట్ చేశారు. ఇక జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద పలువురు దీక్ష చేపట్టనున్నారు. కాగా అన్నాహజారేకు మద్దతు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ర్యాలీలు, దీక్షలు నిర్వహిస్తున్నారు.
కాగా దీక్షలు, ర్యాలీలో పాల్గొన్న యువత కేవలం రాజకీయ నాయకులలో మార్పు కోరుకుంటే అది సాధ్యం కాదని, ప్రజలలో కూడా మార్పు రావాలని ఆకాంక్షించారు. అవినీతి రాజకీయ నాయకులను మనమే అందలం ఎక్కిస్తున్నామని వారికి బుద్ది చెప్పాలని అన్నారు. అన్నాహజారే దీక్ష యావద్భారతాన్ని కదిలించిందన్నారు. ప్రభుత్వాలు అవినీతి, అక్రమాలు చేయకుండా ఉండాలంటే యువత ముందుండాలన్నారు. యువతలో ఇప్పుడిప్పుడో మేలుకొలుపు వస్తుందన్నారు.












Click it and Unblock the Notifications