హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ ఎఫెక్ట్: పోటీకి వెనక్కి తగ్గిన కందుల బ్రదర్స్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీలో చేరినప్పటికీ కడప పార్లమెంటు సీటులో పోటీ చేయడానికి కందుల బ్రదర్స్ నిరాకరించడం వెనక వైయస్సార్ కాంగ్రెసు నాయకుడు వైయస్ జగన్ ప్రభావమే పని చేసినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెసులోకి తీసుకొచ్చి జగన్‌పై కందుల రాజమోహన్ రెడ్డిని పోటీకి దించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నించారు. అయితే, ఆయన పోటీకి నిరాకరించారు. దాంతో ఆయన సోదరుడు కందుల శివానంద రెడ్డిని జగన్‌పై పోటీకి సిద్ధం చేయడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నం కూడా బెడిసి కొట్టింది. దీంతో మంత్రి రవీంద్రా రెడ్డినే పోటీకి దించాల్సిన స్థితిలో కాంగ్రెసు పార్టీ నాయకత్వం భావించింది.

జగన్‌పై పోటీ చేయడానికి తొలుత కందుల రాజమోహన్ రెడ్డి సిద్ధపడ్డారు. అయితే, కుమారుల నుంచి, సమీప బంధువుల నుంచి వ్యతిరేకత ఎదురు కావడంతో ఆయన వెనక్కి తగ్గారు. కందుల బ్రదర్స్‌పై వారు తీవ్రమైన ఒత్తిడి తెచ్చి పోటీ నుంచి తప్పించారు. వైయస్ జగన్‌ వ్యూహమే దీని వెనక పనిచేసినట్లు చెబుతున్నారు. కడప లోకసభ నియోజకవర్గంలో జగన్‌కు మద్దతు ఇవ్వాలనే దృష్టితోనే కందుల బ్రదర్స్ వర్గం మొగ్గు చూపినట్లు చెబుతున్నారు. దీంతో పోటీకి దిగవద్దని కందుల బ్రదర్స్‌కు నచ్చజెప్పినట్లు సమాచారం. ఈ స్థితిలో కందుల సోదరులు కాంగ్రెసు అభ్యర్థి డిఎల్ రవీంద్రా రెడ్డి విజయానికి పనిచేస్తారా అనేది కూడా అనుమానంగానే ఉందని అంటున్నారు.

English summary
Kandula brothers rejected to contest from Kadapa loksabha seat is due to YS Jagan factor. It is said that their supporters and followers appealed to Kandula brothers not to contest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X