పురంధేశ్వరిపై ధ్వజమెత్తిన తెలుగుదేశం సీనియర్ నేత ఎర్రంనాయుడు

పురంధేశ్వరి కాంగ్రెసులో చేరి నాన్నగారి ఆశయాలకు తిలోదకాలిచ్చారని ఆయన విమర్శించారు. పురంధేశ్వరి మూడు పార్టీలు మారారని ఆయన అన్నారు. ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా కాంగ్రెసు పార్టీ కుట్ర చేసి నాదెండ్ల భాస్కర రావును ప్రయోగించిందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ కుట్రలకూ కుతంత్రాలకూ నిలయమని, అటువంటి పార్టీలో పురంధేశ్వరి ఉన్నారని ఆయన అన్నారు. మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి పురంధేశ్వరి తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు కుక్కలు చింపిన విస్తరి అని, కాంగ్రెసును ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications