సోనియాగాంధీపై వైయస్ వ్యాఖ్యలే ప్రచారాస్త్రాలు: మంత్రులకు సిఎం సూచన

వైయస్ కాంగ్రెసు పార్టీ నేత అన్నారు. వైయస్ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని పొగుడుతూ చేసిన వ్యాఖ్యలను ఓటర్లలోకి తీసుకు వెళ్లాలని సూచించారు. సోనియాను వైయస్ పొగిడిని సీడీలే ప్రధానం అస్త్రంగా వినియోగించుకోవాలని సూచించారు. ఉప ఎన్నికలలో తెలంగాణ మంత్రులు కూడా పాల్గొనాలని సూచించారు. కాగా కడప పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు ఏడుగురు మంత్రులను ఇంఛార్జులుగా నియమించారు.
కాగా సమావేశం అనంతరం మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ విలేకరులతో మాట్లాడారు. జగన్ కారణంగానే ఎన్నికలు వచ్చాయన్నారు. జగన్ ముఖ్యమంత్రి పదవి కోసమే ఎన్నికలు వచ్చేలా చేశారన్నారు. వైయస్ బొమ్మను వాడుకునే హక్కు కేవలం కాంగ్రెసు పార్టీకే ఉందన్నారు. వైయస్ కాంగ్రెసు సొత్తు అని అన్నారు. వైయస్ జగన్ పార్టీ సొత్తు కాదన్నారు.












Click it and Unblock the Notifications