సోనియా ఏం రాశారో చదవండి: వైయస్ జగన్‌పై ఉండవల్లి నిప్పులు
రాజమండ్రి: మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆదివారం నిప్పులు గక్కారు. తన రాజకీయ అవసరాల కోసమే జగన్, ఆయన మద్దతుదారులు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెసు పార్టీని కానీ, సోనియాగాంధీని కానీ విమర్శిస్తే చూస్తూ ఊరుకోమన్నారు.
తమ అభిమాన నాయకుడు తనయుడు కాబట్టి ఇన్నాళ్లూ చూస్తూ ఊరుకున్నామని హెచ్చరించారు. చరిత్రను వక్రీకరించి సోనియాను, వైయస్‌ను విమర్శలు చేస్తే ఊరుకునేది మాత్రం లేదన్నారు. వైయస్ పాదయాత్ర చేసినప్పుడు చావుబతుకుల మధ్య ఉన్నప్పుడు కూడా జగన్ తండ్రిని చూడటానికి రాలేదన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు తండ్రి గురించి మాట్లాడటం ఏమిటని అన్నారు. సోనియాను విమర్శించే ముందు ఇడుపులపాయలో వైయస్ సమాధి వద్ద పుస్తకంలో సోనియా ఏం రాశాలో చదవండి అని సూచించారు.












Click it and Unblock the Notifications