గాలి జనార్దన్ రెడ్డికి బ్రాహ్మణిపై 30 రోజుల గడువు: కిరణ్ ప్రభుత్వం నోటీసు

2009 డిసెంబరు తర్వాత రాజకీయ ఒత్తిళ్ల కారణంగా బ్రహ్మణిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వైఎస్ మరణం, గనుల వ్యాపారం స్తంభించిపోవడం వల్లే పనుల్ని కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందంటూ యాజమాన్యం సాకులు చెబుతుండగా ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. చివరికి ఇటీవల రాష్ట్రంలో భూముల కేటాయింపు వ్యవహారం వివాదాస్పదమై, శాసనసభ, మండలిలో బ్రహ్మణి ప్రకంపనలు సృష్టించడం, విపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. గాలి జనార్దన్‌రెడ్డి సొంతంగా ఈ కర్మాగారాన్ని చేపట్టే పరిస్థితి లేనందున ఒప్పందాన్ని రద్దుచేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సంజాయిషీ నోటీసు ఇవ్వాలని పరిశ్రమల శాఖను ఆదేశించింది. న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా న్యాయశాఖను సంప్రదించాక పరిశ్రమల శాఖ నోటీసును సిద్ధంచేసి శుక్రవారం జారీ చేసింది.