హరికృష్ణ డమాల్, తనయుడు నారా లోకేష్‌కు చంద్రబాబు లైన్ క్లియర్

Chandrababu Naidu
హైదరాబాద్: కృష్ణా జిల్లా పార్టీ సంక్షోభాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన తనయుడు నారా లోకేష్‌కు పరిస్థితిని అనుకూలంగా మార్చేందుకు వాడుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన కుమారుడు లోకేష్‌కు లైన్ క్లియర్ చేసి, పార్టీ నాయకత్వ బాధ్యతలను అప్పగించాలనే ఎత్తుగడలో నందమూరి కుటుంబ సభ్యుల మనోగతాన్ని, ముఖ్యంగా నందమూరి హరికృష్ణ ప్రతిస్పందనను తెలుసుకోవడానికే చంద్రబాబు కృష్ణా జిల్లా రాజకీయాలను వాడుకున్నట్లు చెబుతున్నారు. నిజానికి, కృష్ణా జిల్లా పార్టీ వ్యవహారాలు చంద్రబాబు తలుచుకుంటే వెంటనే కొలిక్కి వచ్చేవని, కానీ అలా కాకుండా సాధ్యమైనంత వరకు హరికృష్ణ వర్గానికి చెందిన నాయకులను రెచ్చగొట్టడానికి వాడుకున్నారని అంటారు.

హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ ఏ మేరకు ముందుకు వెళ్తారనేది కూడా చూడాలని ఆయన అనుకున్నట్లు చెబుతారు. వాస్తవానికి, హరికృష్ణకు ఓ ఫోన్ కొట్టి మాట్లాడితే కృష్ణా జిల్లా వ్యవహారాలు చక్కబడి ఉండేవని అంటారు. కానీ, అందుకు చంద్రబాబు సిద్ధపడలేదు. హరికృష్ణకు ప్రాధాన్యం తగ్గించడం కూడా చంద్రబాబు ఎత్తుగడలోని ఆంతర్యమని అంటారు. జూనియర్ ఎన్టీఆర్‌కు ఆయన సింగపూర్ నుంచి ఫోన్ చేశారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. దాన్ని సాకుగా తీసుకుని హరికృష్ణతో గానీ జూనియర్ ఎన్టీఆర్‌తో గానీ మాట్లాడకుండా పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకున్నారని విశ్లేషిస్తున్నారు. ఒక రకంగా వారి స్థాయిని తగ్గించడం కూడా ఆయన వ్యూహంలో ఒక భాగం. దానివల్ల భవిష్యత్తులో తన కుమారుడిని ముందుకు తెస్తే కూడా వారు పోటీకి రాకుండా చూసుకునేందుకు ఇటువంటి వ్యవహారం ఎలా పనికి వస్తుందనేది ఆయన చూడదలుచుకున్నారు.

కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమా మహేశ్వర రావుతో కలిసి పనిచేసేది లేదని చెప్పిన పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు వల్లభనేని వంశీ తనంత తానుగా దిగి వచ్చి చంద్రబాబుకు క్షమాపణలు చెప్పారు. దేవినేని ఉమతో కలిసి పనిచేస్తానని చెప్పారు. తాను తప్పు చేశానని కూడా అంగీకరించారు. తన వల్ల పార్టీలో వారసత్వ పోరు జరుగుతుందనే వార్తలు వస్తుండడంతో తాను సరిగా వ్యవహరించలేదని తెలుసుకున్నట్లు ఆయన ఆయన చెప్పారు. మొత్తం మీద, లోకేష్‌కు లైన్ క్లియర్ చేసి జూనియర్ ఎన్టీఆర్‌ను తన దారిలోకి తెచ్చుకోవడానికి చంద్రబాబు పాచికలు వేస్తున్నట్లు అర్థమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+