వైయస్ జగన్‌పై గెలుపునకు ఢిల్లీలో సిఎం కిరణ్ వ్యూహం: ఆజాద్‌తో భేటీ

జగన్‌కు సెంటిమెంటు కలిసి వస్తున్నందున కాంగ్రెసు పార్టీ ఏదో ఒక స్థానం నుండి గెలుపొందేందుకు గట్టిగా ప్రయత్నాలు చేసే దిశలో వారు యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఒకవేళ పార్టీ రెండు స్థానాలలో ఓడినప్పటికీ జగన్ మెజార్టీని భారీగా తగ్గించాలనే యోచనలో కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తోంది. మెజార్టీ తగ్గించడం ద్వారా అయినా జగన్ ఇమెజ్ డామేజ్ చేయవచ్చని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. సిఎంకు కూడా అదే విషయాన్ని చెప్పినట్టుగా సమాచారం. ప్రధానంగా జగన్ మెజార్టీ తగ్గించేందుకు ప్రయత్నాలు చేయాలని సూచించినట్లుగా తెలుస్తోంది.
ఆజాద్‌తో భేటీ అనంతరం సిఎం అహ్మద్ పటేల్‌తో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే భేటీ కావాల్సి ఉన్నప్పటికీ అహ్మద్ పటేల్ నుండి పిలుపు రాక పోవడంతో వేచి చూస్తున్నారు. ఆ తర్వాత ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని కూడా కలిసి ఉప ఎన్నికలపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాగా ప్రధానంగా ఉప ఎన్నికలలో వ్యూహం కోసం వెళ్లినప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిపై కూడా కిరణ్ కేంద్ర ప్రతినిధిలతో చర్చించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications