హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎం మౌనమే వ్యతిరేకం, 16లోగా లేఖ రాయాలి: మందకృష్ణ మాదిగ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Manda Krishna Madiga
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మౌనమే ఆయన వర్గీకరణకు వ్యతిరేకమని అర్థమవుతుందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బుధవారం ఆరోపించారు. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై లాఠీఛార్జ్ సిఎం ప్రోత్సాహం వల్లనే జరుగుతున్నాయని ఆరోపించారు. వర్గీకరణపై ముఖ్యమంత్రి వెంటనే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు లేఖ రాయాలని కోరారు. ఈ నెల 16వ తేది వరకు ముఖ్యమంత్రికి లేఖ రాయడానికి సమయం ఇస్తామని అన్నారు. ఆ లోపు కేంద్రంపై ఒత్తిడికి సిఎం ప్రయత్నాలు చేయకుంటే కడప ఉప ఎన్నికలలో ఎమ్మార్పీఎస్ కాంగ్రెసుకు బుద్ధి చెబుతుందని హెచ్చరించారు.

ఈ నెల 17, 18వ తేదీలలో గుంటూరులో జరిగే ఎమ్మార్పీఎస్ సభలలో కడప ఎన్నికలపై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో వర్గీకరణ బిల్లును పెట్టించడానికి కేంద్రంపై సిఎం ఒత్తిడి తేవాలని కోరారు. అఖిల పక్షానికి సిఎం సారథ్యం వహించలేదన్నారు. అన్ని పార్టీలు వర్గీకరణకు మద్దతు ఇస్తున్నప్పటికీ సిఎం ఏమీ మాట్లాడక పోవడం ఏమిటని ప్రశ్నించారు.

English summary
MRPS president Manda Krishna Madiga ordered a ultimatum to CM Kiran Kumar Reddy today on MRPS categorization.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X