జగన్ సాక్షిపై చర్యలు తీసుకోవాలని కోరాం: ఎంపీ నామా నాగేశ్వర రావు

కడప జిల్లాలో ఉప ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈసిని కోరినట్లు చెప్పారు. గతంలో ఎప్పుడు కూడా స్వేచ్ఛగా ఎన్నికలు జరగలేదని ఆయన ఆరోపించారు. గతంలో ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే తెలుగుదేశం పార్టీ అక్కడ గెలిచేదని అన్నారు. ఇప్పుడైనా ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. అందుకు ఈసి సానుకూలంగా స్పందించిందన్నారు. కడపకు ప్రత్యేక బృందాన్ని పంపించనున్నట్లు చెప్పారన్నారు. పోలింగ్ సిబ్బందికి కూడా రక్షణ కల్పించాలని కోరినట్లు చెప్పారు.
కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికలలో అధికార కాంగ్రెసు పార్టీ, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ భారీగా అక్రమాలకు పాల్పడుతుందని చెప్పారు. వాటిని అడ్డుకోవాలని ఈసిని కోరినట్లు చెప్పారు. రిగ్గింగుకు కూడా పాల్పడే అవకాశాలున్నందున సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications