తమిళనాట రూ.40కోట్లు పట్టుకున్న ఈసీ: ఓటు వేసిన రజనీ

అయితే తమిళనాడు పార్టీలు వెదజల్లిన డబ్బు మరే రాష్ట్రంలో కనిపించక పోవడం విశేషం. ఈసి పట్టుకున్న సుమారు అరవై కోట్ల రూపాయలలో మూడు వంతుల వరకు ఒక్క తమిళనాడుదే కావడం విశేషం. పార్టీలు ఒక్కో ఓటరుకు రూ.500 ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. డబ్బులు పంచి పెట్టడానికి ఉద్యోగులు, విద్యార్థులను పార్టీలు ఉపయోగించుకోవడం శోచనీయం. కాగా ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే జయలలిత, కరుణానిధిలు మాటల తుటాలు విసురుకోవడం విశేషం.
కాగా దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్, విలక్షణ నటుడు కమల్ హాసన్ తమ ఓటు హక్కును చెన్నైలో వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి కరుణానిధి, ఉప ముఖ్యమంత్రి స్టాలిన్, ప్రతిపక్ష నేత జయలలిత, ఎంపీ కనిమొళి, విజయ్‌కాంత్ తదితర ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.












Click it and Unblock the Notifications