తెలంగాణ సాధన కోసం చండీయాగం: ప్రారంభించిన టిఆర్ఎస్ అధినేత కెసిఆర్
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ సాధనను కోరుతూ తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో గురువారం చండీయాగం ప్రారంభించారు. యాగాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభించారు. ఈ యాగాన్ని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో నిర్వహిస్తున్నారు. 64 మంది వేద పండితుల పారాయణం మధ్య కెసిఆర్ సతీమణితో కలిసి యాగంలో కూర్చున్నారు. తెలంగాణ సాధనలో భాగంగా టిఆర్ఎస్ ఆధ్వర్యంలో యాగం నిర్వహిస్తున్నట్లు కెసిఆర్ ఇప్పటికే ప్రకటించారు.
తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరి, తెలంగాణ కాంగ్రెసు నేతలలో మార్పును కూడా ఆయన కోరుకుంటున్నారు. వారంతా వెంటనే తెలంగాణకు అనుకూలంగా మారాలని ఆయన కోరుకున్నారు. యాగం మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. వేదపండితులు ఉదయం 8 గంటలకు యాగాన్ని ప్రారంభించారు. పండితులు ముందుగా సంకల్పం నిర్వహించి అనంతరం పారాయణం ప్రారంభించారు. ఈ యాగం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయని అందరూ నమ్ముతారు.