హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ వివేకాను సిఎం చేస్తారని భయపడి జగన్ రాజీనామా: ఉండవల్లి

By Pratap
|
Google Oneindia TeluguNews

Undavalli Arun Kumar
హైదరాబాద్: ఉండవల్లి ఊసరవెల్లి అంటూ సాక్షి దినపత్రికోల వచ్చిన వార్తాకథనానికి కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రంగా ప్రతిస్పందించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు, సాక్షి అధిపతి వైయస్ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సాక్షిలో సంధించిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇస్తూ ఆయన ఓ సిడీని గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విడుదల చేశారు. చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తారనే భయంతోనే వైయస్ జగన్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారని ఆయన వ్యాఖ్యానించారు. వైయస్ వివేకానంద రెడ్డికి పదవి ఇవ్వడంతో జగన్ అభద్రతా భావానికి గురయ్యారని ఆయన అన్నారు. నీకు ఉన్నంత డబ్బు నాకు లేకపోవచ్చు గానీ నాకు గుండె ధైర్యం ఉంది అని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.

వైయస్సార్ సతీమణి విజయమ్మను కాంగ్రెసు నాయకులు ఎవరూ విమర్శించలేదని, వైయస్ జగన్ ఓదార్పు యాత్రను కాంగ్రెసు వ్యతిరేకించలేదని ఆయన అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ఓదార్పు యాత్రపై జగన్ తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని ఆయన అన్నారు. వైయస్ మరణంపై అనుమానాలుంటే వైయస్ జగన్ పార్లమెంటులో ఎందుకు ప్రస్తావించలేదని ఆయన అడిగారు. జగన్ రాజకీయ క్రీడ ఆడున్నాడని ఆయన విమర్శించారు. జగన్ తన తల్లిని ఎండలో తిప్పడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఓదార్పు యాత్ర కాంగ్రెసుకు ఉపయోగపడుతుందనే భయంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డిని తాను పల్లెత్తు మాట అనలేదని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణానికి తాను ఎందుకు సమాధానం చెప్పాలని, వైయస్ కుమారుడిగా అడిగే బాధ్యత వైయస్ జగన్‌కు లేదా అని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడినవారిని తాను అడ్డుకున్నానని ఆయన అన్నారు. వైయస్సార్ ఆశయాల మేరకే తాను కాంగ్రెసులో కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు.

English summary
Congress MP Undavalli Arun Kumar retaliates YS Jagan's Sakshi daily report. He said that YS Jagan is resorting to false campaign against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X