భవిష్యత్తు ఇంటర్నెట్ అంతా వేలిముద్రలతోనే కోనసాగనుందా...?

ఆఫీస్ నుంచి బయల్దేరుతూనే ఇంట్లో ఏసీని ఆన్ చేయగలుగుతారు. ఈ వూహలన్నీ 2020 నాటికి వైర్‌లెస్ నెట్‌వర్క్ ద్వారా నిజం కానున్నాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటి హార్డ్‌డ్రైవ్‌లు, పోర్టబుల్ స్టోరేజ్ పరికారాలు చరిత్రగా మిగిలి పోనున్నాయి. 'క్లౌడ్ కంప్యూటింగ్'తో డేటా మొత్తాన్ని ఆన్‌లైన్‌లోనే భద్రం చేసుకుని ఎక్కడైనా వాడుకోవచ్చు. ఇంటర్నెట్‌ను మాటలతోనే బ్రౌజ్ చేయవచ్చు. యూజర్‌నేమ్‌లు, పాస్‌వర్డ్‌లు పోయి ముఖం, మాటలు, వేలిముద్రలు లాగిన్ తాళాలుగా మారిపోతాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి నెట్ వాడకానికి సంబంధించిన నిజాల్ని నెమరు వేసుకుంటూ, భవిష్యత్తు అంచనాలను చూద్దాం.
1. ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య
ప్రపంచ వ్యాప్తంగా 6.9 బిలియన్ల జనాభాలో 2010 లెక్కల ప్రకారం నెట్ యూజర్లు 1.8 బిలియన్లు. 2020 నాటికి వీరి సంఖ్య ఐదు బిలియన్లకు చేరొచ్చని అంచనా.
2. ఇంటర్నెట్ ట్రాఫిక్
నెట్‌లో ట్రాన్స్‌ఫర్ అయ్యే డేటా (ఇంటర్నెట్ ట్రాఫిక్) గిగాబైట్స్‌కి గుడ్‌బై చెప్పేస్తూ exabytesకి ఆహ్వానం పలికింది. 2012 నాటికి నెలకి ఇంటర్నెట్ ట్రాఫిక్ 44 exabytesకి పెరగొచ్చు. ప్రస్తుతం ఉన్న దానికి ఇది రెండు రెట్లు ఎక్కువ. (1 exabyte= 1 బిలియన్ గిగాబైట్స్)
3. వైర్‌లెస్ నెట్‌వర్క్ వినియోగదారులు
2020 నాటికి నెట్‌ని కనెక్ట్ అవ్వడానికి భవనాలు, బ్రిడ్జ్‌లపైన బిలియన్ల కొద్దీ సెన్సర్లు అందుబాటులోకి వస్తాయి. 2009లో వైర్‌లెస్ నెట్‌వర్క్ వినియోగదారుల సంఖ్య 257 మిలియన్లు. 2014 కల్లా వీరి సంఖ్య 2.5 బిలియన్లకు చేరొచ్చు. భవిష్యత్ మొత్తం క్లౌడ్ కంప్యూటింగ్‌దే. ప్రపంచ వ్యాప్తంగా 2015 నాటికి క్లౌడ్ కంప్యూటింగ్ 45.4 బిలియన్ డాలర్లను ఆర్జించవచ్చని అంచనా.
4. ట్విట్టర్ ఈమెయిల్స్
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రోజూ 294 బిలియన్ల ఈమెయిల్స్ పంపుతున్నారు. అంటే ఒక సెకన్‌లో 2.8 మిలియన్ల కంటే ఎక్కువ మెయిళ్లు ఇన్‌బాక్స్‌ల్ని చేరుతున్నాయి. ఈ లెక్కన భవిష్యత్తు లెక్కలు అంచనాలకు అందనిదే. ట్విట్టర్‌లో 5 మిలియన్ల ట్విట్స్‌ని పోస్ట్ చేస్తున్నారు. ఒక రోజులో 45 మిలియన్ల స్టేటస్ అప్‌డేట్‌లు రికార్డ్ అవుతున్నాయి.
5. ఫోటో ఫ్లిక్కర్
ప్రతిరోజూ ఫ్లిక్కర్ ఫొటో షేరింగ్ సైట్‌లో 3 మిలియన్ల ఫొటోలను అప్‌లోడ్ చేస్తున్నారు. ఇది కనీసం పది రెట్లు పెరిగిపోతుంది. మొబైళ్ల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజు 43,339,537 గిగాబైట్ల డేటాని పంపుతున్నారు. ఈ డేటా మొత్తం 9.2 మిలియన్ల డీవీడీలు, 1.7 మిలియన్ల బ్లూరే డిస్క్‌లతో సమానం. ప్రపంచ వ్యాప్తంగా సోషల్ నెట్‌వర్క్, మెయిల్ సర్వీసుల వినియోగదారుల సంఖ్య వరుసగా... స్కైపే 700 మిలియన్లు, ఫేస్‌బుక్ 600, హాట్‌మెయిల్ 364, యాహూ 384, జీమెయిల్ 173, మైస్పేస్ 126, ఫ్రెండ్‌స్టర్ 115, ట్విట్టర్ 114, Linkedin 10 మిలియన్లు.
6. యూట్యూబ్
యూట్యూబ్‌లో ప్రతిరోజు 2 బిలియన్ల వీడియోలను వీక్షిస్తున్నారు. ప్రతి నిమిషానికి 35 గంటల నిడివితో కూడిన వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెట్ యూజర్ల శాతం భాషల వారీగా... ఇంగ్లీష్ 27.3 శాతం, చైనీస్ 22.6, స్పానిష్ 7.8, జర్మన్ 3.8, ఫ్రెంచ్ 3, జపనీస్ 5, కొరియన్ 2, అరబిక్ 3.3, రష్యన్ 3, ఇతర భాషలు 17.8 శాతం.