హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆరేళ్ల బాలుడిని మూడు రోజులు నిర్బంధించిన స్కూల్ యాజమాన్యం

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల బాలుడిని పాఠశాల యాజమాన్య మూడు రోజుల పాటు నిర్బంధించిన సంఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. ఫీజు చెల్లించలేదని ఆరోపిస్తూ ఉదయ్ కిరణ్ రెడ్డి అనే బాలుడిని ఇంటికి పంపడానికి వనస్థలిపురంలోని కెబిఎస్ పాఠశాల యాజమాన్యం నిరాకరించి, పాఠశాలలో నిర్బంధించింది. మిగతా పిల్లలంతా సెలవులకు ఇళ్లకు వెళ్లిపోగా ఆ బాలుడు మాత్రం పాఠశాలలోనే ఖైదీ మాదిరిగా ఉండిపోయాడు. దీనిపై ఉదయ్ కిరణ్ రెడ్డి తండ్రి ఆల్వాల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తమకు ఇంకా 8 వేల రూపాయల ఫీజు బాకీ ఉన్నారని, ఆ మొత్తాన్ని చెల్లించే వరకు బాలుడిని మీతో పంపబోమని యాజమాన్యం తనతో చెప్పి తన కుమారుడిని నిర్బంధించారని ఆల్వాల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ బాలుడిని పోలీసు స్టేషన్‌కు తెచ్చారు. పాఠశాలకు చెందిన ఇద్దరు యాజమన్య ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు. అయితే, తాము బాలుడిని నిర్బంధించలేదని, తాము బాలుడిని తీసుకుని వెళ్లాలని చెప్పినా తల్లిదండ్రులకు చెప్పినా వినలేదని పాఠశాల యజమాని భూపతిరెడ్డి చెప్పారు.

English summary
A school management detained 6 years boy, alleging non payment of fee. As his son Uday Kiran Reddy was detained for 3 days, Alwal Reddy complained to the police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X