హైదరాబాద్: 125 సంవత్సరాల చరిత్ర కలిగిన జాతీయ పార్టీ అయిన కాంగ్రెసు పార్టీకి ఏ పార్జీ ప్రత్యామ్నాయం కాదని మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీని ఉద్ధేశించి బద్వేలు ఎమ్మెల్యే కమలమ్మ శుక్రవారం అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశం అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అధిష్టానం చర్యలు తీసుకుంటుందని భయపడి తాను వెనక్కి తగ్గలేదని చెప్పారు. ఒక ప్రజా ప్రతినిధిగా ప్రజలలో ఉండటానికి కాంగ్రెసు పార్టీయే ఉత్తమమని భావించినట్లు చెప్పారు.
జగన్ పార్టీలో సామాజిక న్యాయం గురించి తాను ఏమీ చెప్పదల్చుకోల్దని అయితే తనకు మాత్రం న్యాయం జరగడం లేదని తాను భావించానని చెప్పారు. తన నియోజకవర్గంలోనే కోటరీ ఉండటాన్ని తాను వ్యతిరేకించానని చెప్పారు. కాంగ్రెసు పార్టీలోనే ఉండి ఉప ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు. తాను కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదని చెప్పారు.
Badvel MLA Kamalamma said today in media conference that there is no any other party instead of Congress. She said Jagan party is neglecting her. She did not like to comment on social justice in Jagan's party.
Story first published: Friday, April 15, 2011, 16:56 [IST]