వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వానికి ఎదురు దెబ్బ, వినాయక్ సేన్‌కు సుప్రీంకోర్టు బెయిల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Suprem Court
న్యూఢిల్లీ: పౌరహక్కుల కార్యకర్త వినాయక్ సేన్ వ్యవహారంలో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. వినాయక్ సేన్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. రాజద్రోహం, నక్సలైట్లతో సంబంధాలున్నాయనే కేసులో ఆయనకు జీవిత ఖైదు పడింది. సేన్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు మావోయిస్టుల పట్ల సానుభూతి చూపినంత మాత్రాన దోషిగా నిలబెట్టి, జైలులో పెట్టడానికి వీలు లేదని స్పష్ఠం చేసింది.

వినాయక్ సేన్‌కు బెయిల్ ఇవ్వకూడదని కేంద్ర ప్రభుత్వం చేసిన వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తిరిగి వినాయక్ సేన్‌ను అదుపులోకి తీసుకునేందుకు సరైన సాక్ష్యాధారాలు చూపాలని ఆదేశించింది. వినాయక్ సేన్ రాజద్రోహానికి పాల్పడినట్లు ప్రభుత్వం చేసిన ఆరోపణను కూడా సుప్రీంకోర్టు తోసి పుచ్చింది. మావోయిస్టుల సాహిత్యం ఉన్నంత మాత్రాన వినాయక్ సేన్ నక్సలైట్ కార్యకలాపాలతో సంబంధాలు కలిగి ఉన్నాడని చెప్పలేమని స్పష్టం చేసింది.

తన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఛత్తీస్‌ఘడ్ హైకోర్టు ఫిబ్రవరి 10వ తేదీన జారీ చేసిన ఆదేశాలను వినాయక్ సేన్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తనపై సరైన సాక్ష్యాధారాలు లేకుండానే తనను కింది కోర్టు దోషిగా ప్రకటించిందని సేన్ ఆరోపించారు. సేన్ బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ఆయనకు మావోయిస్టులతో లోతైన సంబంధాలున్నాయని ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం అఫడవిట్ దాఖలు చేసింది. వినాయక్ సేన్ ప్రస్తుతం ఛత్తీస్‌ఘడ్ రాజధాని రాయపూర్ జైలులో ఉన్నారు .

English summary
In a major setback to the government, the Supreme Court on Friday granted bail to the civil rights activists Binayak Sen, who had been sentenced to life imprisonment for sedition and links with Naxalites.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X