భార్య, వదినలను నరికి చంపిన ఉన్మాది: తాను ఆత్మహత్య

East Godavari
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో ఓ ఉన్మాది తన భార్యను, వదిలను, అత్తను నరికి చంపిన దుర్ఘటన గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. జిల్లాలోని గోకవరం మండలం తిరుమలాయపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన సత్యనారాయణకు అదే గ్రామానికి చెందిన వరలక్ష్మితో కొన్నెళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే కొన్ని రోజులుగా ఆ కుటుంబంలో ఆస్తి వివాదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం వరకు ఆయన ఊళ్లో లేరని తెలుస్తోంది. అయితే ఊరిలోకి వచ్చిన తర్వాత ఆస్తి వివాదంపై కాస్త ఘర్షణ జరిగి ఆ తర్వాత సద్దుమణిగినట్లుగా తెలుస్తోంది. అయితే గురువారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో సత్యనారాయణ తన భార్య వరలక్ష్మి, అత్త మంగతాయారు, వదిన సీత, మరో వదినను కూడా కత్తితో నరికి చంపారు. వారిని చంపిన అనంతరం సత్యనారాయణ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో అరుపులు వినబడటంతో స్థానికులు వెళ్లి చూశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

కాగా మెదక్ జిల్లా అల్లాదుర్గంలో తగాదాల కారణంగా తన భార్యను నరికి తాను ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన గురువారం చోటు చేసుకుంది. వీరి మృతికి కుటుంబ తగాదాలే కారణం అని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+