ఎమ్మెల్యేలతో ఇడుపులపాయలో వైయస్ జగన్ రహస్య సమావేశం

కాగా, జగన్ లోకసభ స్థానానికి శుక్రవారం నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి రోజా, కొండా సురేఖ, పుల్లా పద్మావతి వంటి నాయకులతో పాటు శాసనసభ్యులు కూడా హాజరయ్యారు. శనివారం పులివెందుల స్థానానికి వైయస్ విజయమ్మ నామినేషన్ దాఖలు చేయనున్నారు. బద్వేలు శాసనసభ్యురాలు తిరిగి కాంగ్రెసు వైపు వెళ్లిన నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా జగన్ శాసనసభ్యులతో చర్చించినట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తమపై వస్తున్న విమర్సలను తిప్పి కొట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications