కెసిఆర్‌పై దుమ్మెత్తి పోసిన ఎర్రబెల్లి, బండారం బయటపెడతానని హెచ్చరిక

Errabelli Dayakar Rao
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై, ఆయన కుమారుడు, శాసనసభ్యుడు కెటి రామారావుపై తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత శానససభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు దుమ్మెత్తిపోశారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని కెసిఆర్ కోట్లు సంపాదించారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. హైదరాబాదు చుట్టుపక్కల వేయి ఎకరాలు సంపాదించారని ఆయన అన్నారు. తెలంగాణ కోసం కెసిఆర్ కుటుంబం ఏం త్యాగాలు చేసిందని ఆయన అడిగారు. కెసిఆర్ విద్యార్థులను రెచ్చగట్టే ప్రసంగాలు చేశారని ఆయన అన్నారు.

కెసిఆర్ కూతురు కవిత, కుమారుడు కెటి రామారావు ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదిస్తున్నారని ఆయన అన్నారు. కెసిఆర్ బండారం బయటపెడతామని ఆయన అన్నారు. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం చేసి తమ నాయకుడు చంద్రబాబు జైలుకు వెళ్లారని, కెసిఆర్ ఒక్క రోజు కూడా జైలుకు వెళ్లలేదని, పోలీసు దెబ్బ తినలేదని ఆయన అన్నారు. త్యాగాలు చేసినవారిని విస్మరించి ఏ త్యాగాలు చేశారని కెటి రామారావుకు సిరిసిల్ల టికెట్ ఇచ్చారని ఆయన అడిగారు. కెసిఆర్ ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు.

2009 ఎన్నికల్లో తాము కెసిఆర్‌తో పొత్తు పెట్టుకోవడం వల్లనే ఓడిపోయామని ఆయన చెప్పారు. విద్యార్థుల త్యాగాలను కెసిఆర్ కుటుంబం సొమ్ము చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కెటి రామారావుపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. కెటి రామారావుకు తమను విమర్సించే హక్కు లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+