దిగొచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి: జివో 177 నిలిపివేత

జీవో 177ను తాత్కాలికంగా నిలిపేయాలనే నిర్ణయాన్ని సీమాంధ్ర మంత్రులు వ్యతిరేకించారని చెబుతున్నారు. అయితే జీవోను తాత్కాలికంగా నిలిపేస్తూ దానిపై ముగ్గురు మంత్రులతో ముఖ్యమంత్రి ఓ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. ట్రెజరీ శాఖలో అదనంగా 433 ఉద్యోగాలు కల్పించాలని, కాలుష్యనివారణ మండలిలో అదనంగా 90 ఉద్యోగాలు కల్పించాలని, విశాఖ, కరీంనగర్‌లో రెండు ఏపీఎస్పీ బెటాలియన్లు ఏర్పాటుచేయాలని నిర్ణయించామన్నారు. వ్యవసాయశాఖ బాధ్యతలను తాత్కాలికంగా మంత్రి దామోదర రాజనర్సింహకు అప్పగించాలని నిర్ణయించారన్నారు. ప్రజాపథం కార్యక్రమ నిర్వహణకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేశామని, ఈ కార్యక్రమంలో సాగునీరు, పారిశుధ్యం అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తామని మంత్రి తెలిపారు. బీసీ జాబితాలో అదనంగా 5 కులాలను చేర్చాలని నిర్ణయించామన్నారు.
కాగా, కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో పరిస్థితి ఆశాజనకంగా ఉందని, కాంగ్రెసు పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గ సమావేశంలో అన్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల్లో పరిస్థితి కాంగ్రెసుకు అనుకూలంగా మారుతోందని ఆయన చెప్పినట్లు సమాచారం. ఉప ఎన్నికల్లో గెలుపు బాధ్యత మంత్రులదేనని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications