జగన్‌కు నాగం జనార్దన్ రెడ్డి వత్తాసుపై మోత్కుపల్లి నర్సింహులు ఫైర్

పార్టీకి, చంద్రబాబుకు వ్యతిరేకంగా నాగం జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. తమ పార్టీలో ఓ ముఖ్య నాయకుడిగా కొనసాగుతూ అలాంటి వ్యాఖ్యలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. వైయస్ జగన్ రాష్ట్రాన్ని కొల్లగొట్టారని, అటువంటి జగన్‌తో చంద్రబాబును పోల్చడం బాధాకరమని, అలాంటి వ్యాఖ్య చేయడం సంప్రదాయం కూడా కాదని ఆయన అన్నారు.
తమ పార్టీ తెలంగాణకు కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ సాధన కోసం తాము ఏ త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. మూకుమ్మడి రాజీనామాలు చేయడానికి తాము సిద్దంగా ఉన్నామని, అయితే కాంగ్రెసు శాసనసభ్యులు అందుకు ముందుకు రావడం లేదని ఆయన అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెసుతో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కుమ్మక్కయ్యారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications