జగన్‌కు ఆపాదించి నాపై కుట్ర జరుగుతోంది: నాగం జనార్దన్ రెడ్డి

తెలంగాణ విషయంలో తాను ఎవరి మాటను వినబోనని, దేనికీ తల వంచబోనని ఆయన చెప్పారు. మీడియా రాతలు తెలంగాణను అడ్డుకోలేవని ఆయన అన్నారు. అందరినీ కలుపుకునే తెలంగాణ ఉద్యమం సాగిస్తానని తాను చెప్పానని ఆయన స్పష్టం చేశారు. తాను తెలంగాణ కోసం ఒంటరిగానైనా పోరాడుతానని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని ఆయన చెప్పారు. తాను చెప్పిన మాటలను రాయకుండా వేరే మాటలు రాసి మీడియా తనను దెబ్బ తీయాలని చూస్తోందని ఆయన అన్నారు. జగన్‌పై తాను చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ఆయన చెప్పారు.
తమ పార్టీలో చిల్లర నాయకులున్నారు, వారి వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని తాను అన్నానని ఆయన అంగీకరించారు. తాను ఐదేళ్ల పాటు వైయస్ రాజశేఖర రెడ్డిపై పోరాటం చేశానని, ఇప్పుడు రాజీ పడతానని అనుకోవడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణపై తమ పార్టీతో పాటు కాంగ్రెసు పార్టీ, వైయస్ జగన్ పార్టీ స్పష్టమైన వైఖరిని స్పష్టం చేయాల్సి ఉంటుందని, తెలంగాణపై వైఖరి చెప్పకుండా ఏ పార్టీ కూడా మనుగడ సాగించలేదని ఆయన అన్నారు. తెలంగాణపై వైఖరి చెప్పాలని తాను తమ నాయకుడిని కూడా అడుగుతున్నట్లు ఆయన తెలిపారు. తాను చంద్రబాబుకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తాను తప్పు చేయలేదని, చేయబోనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications