టిడిపిలో ముసలం: ఎర్రబెల్లి దయాకర్ వర్సెస్ నాగం జనార్దన్ రెడ్డి

Telugudesam
హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీలో తెలంగాణ ముసలం మరోసారి రగులుతోంది. పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీలో చిచ్చు రేగింది. నాగం జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ తెలంగాణ మరో నేత ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యతిరేకించారు. కడప ఉప ఎన్నికల ప్రచారంలో తెలంగాణ పార్టీ నేతలు పాల్గొనబోరని చేసిన నాగం జనార్దన్ రెడ్డి ప్రకటనను ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు. తెలంగాణలో చంద్రబాబు కన్నా జగన్‌కు ఎక్కువ క్రెడిబిలిటి ఉందని నాగం జనార్దన్ రెడ్డి అనడం దురదృష్టకరమని ఆయన అన్నారు. తెలంగాణ ఆస్తులను వైయస్ రాజశేఖర రెడ్డి, వైయస్ జగన్‌ దోచుకున్నారని ఆయన అన్నారు.

తెలంగాణ ద్రోహి జగన్‌ను ఓడించడానికి కడప ఉప ఎన్నికల్లో తెలంగాణ నేతలు ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలంగాణలో యాత్ర చేపట్టాలనేది నాగం జనార్దన్ రెడ్డి ఒక్కడి నిర్ణయం కాదని, తెలంగాణ నేతల సమిష్టి నిర్ణయమని ఆయన అన్నారు. సొంత ఎజెండాతో నాగం జనార్దన్ రెడ్డి యాత్ర చేపడితే తాము వ్యతిరేకిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ పార్టీ నేతలు కడప ఉప ఎన్నికల్లో ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

కాగా, మీడియాలో తనపై వచ్చిన వార్తా కథనాలు అవాస్తవమని టీడీపీ సీనియర్ నేత నాగం జనార్థన్‌రెడ్డి అన్నారు. కొందరు పనిగట్టుకుని తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. కడప ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లేది లేదని నాగం తేల్చి చెప్పారు.తెలంగాణ విషయంలో ఎవరి మాటా వినేది లేదని ఆయన స్పష్టం చేశారు. మిగతా అన్ని విషయాల్లోనూ పార్టీ విధానాలకు కట్టుబడి ఉంటానని తెలిపారు. తెలంగాణ జిల్లాల్లో యాత్రను చేపట్టనున్నట్లు నాగం చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+