వదిన గెలిస్తే ప్రతిపక్షంలోనే ఉంటారు, ఆ అవసరం లేదు: వైయస్ వివేకా

ఎమ్మెల్సీగా ఎన్నికై తిరిగి మంత్రిగా కొసాగుతారనే తప్పుడు సంకేతాలు తనపై వెళ్తున్నాయని, దానివల్ల పులివెందులలో వివేకాను ఓడించినా ఫరవా లేదనే ప్రచారం జరుగుతోందని, అందువల్లనే తాను రాజీనామా ఆమోదానికి పట్టుబట్టానని ఆయన చెప్పారు. నామినేటెడ్ పదవులను తాను కోరుకోవడం లేదని, పులివెందుల ప్రజలు గెలిపిస్తేనే మంత్రి పదవి చేపడతానని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల్లో సెంటిమెంటుకు తావు లేదని ఆయన చెప్పారు. కుటుంబ సంక్షేమం చూసుకోవడం కన్నా ప్రజలకు సేవ చేయడం ముఖ్యమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications