జగన్ పార్టీ జెండా తెలంగాణలో ఎగరవద్దు: టి-కాంగ్రెసు ఎంపీలు

తెలంగాణపై కడప ఉప ఎన్నికల అనంతరం కాకుండా ఎన్నికలకు ముందే తెలంగాణపై తన పార్టీ అభిప్రాయాన్ని వెలువర్చాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీ పెట్టినప్పుడు చిత్తశుద్ధి ఉంటే వెంటనే తన ఉద్దేశ్యం చెప్పాలన్నారు. జగన్ పార్టీ జెండాలు తెలంగాణలో ఎగురవేసిన వారు తెలంగాణ వ్యతిరేకులే అన్నారు. అయినా జగన్ పార్టీ అభిప్రాయం అవసరం కూడా లేదని అన్నారు. ప్రచారానికి ఎవరు వెళతారనే విషయంతో తమకు సంబంధం లేదన్నారు. అయితే ఎవరు గెలిచినా తెలంగాణకు వ్యతిరేకులే అన్నారు.
శ్రీకృష్ణ కమిటీ 8వ చాప్టర్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లవద్దని వారు ప్రభుత్వానికి సూచించారు. 8వ చాప్టర్ ను వెంటనే బయట పెట్టాలని వారు డిమాండ్ చేశారు. జస్టిస్ నరసింహారెడ్డి తెలంగాణ వ్యక్తి అయినందునే తెలంగాణకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చారనటం సరికాదు. ఆయనను టార్గెట్ చేయడం సీమాంధ్రులకు సరికాదన్నారు.












Click it and Unblock the Notifications