ఉప ఎన్నికలకు ముందే జగన్ క్యాంప్ శాసనసభ్యులపై వేటుకు రెడీ

YS Jagan
హైదరాబాద్: కడప లోకసభ, పులివెందుల శానససభ స్థానాలకు జరుగతున్న ఉప ఎన్నికలకు ముందే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన శాసనసభ్యులపై వేటుకు కాంగ్రెసు అధిష్టానం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ వెంట వెళ్తున్న కడప జిల్లాకు చెందిన శాసనసభ్యులపైనే ముందస్తుగా చర్యలు తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. శాసనసభ డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ చేత వారిపై అనర్హత వేటు వేయించేందుకు ప్రయత్నాలు ముమ్మరమైనట్లు సమాచారం. కడప జిల్లాకు చెందిన శాసనసభ్యులపై డిసిసి ఇప్పటికే ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి)కి నాలుగు నివేదికలు పంపింది.

జగన్ వర్గానికి చెందిన ఆదినారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులుపై అనర్హత వేటు వేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. వారిపై ప్రభుత్వ చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఫిర్యాదు చేస్తారని, ఆ ఫిర్యాదు మేరకు నాదెండ్ల మనోహర్ చర్యలు తీసుకుంటారని అంటున్నారు. ఇందుకు సంబంధించి రంగమంతా సిద్ధమైనట్లు చెబుతున్నారు.

కాగా, జగన్ వెంట వెళ్తున్న తమ పార్టీ శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, బాలనాగిరెడ్డిలపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాదెండ్ల మనోహర్‌ను కోరింది. అలాగే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థికి ఓటు వేసిన పోచారం శ్రీనివాస రెడ్డిపై కూడా వేటు వేయాలని తెలుగుదేశం పార్టీ కోరింది. ప్రసన్నకుమార్ రెడ్డిపై, బాలనాగిరెడ్డిపై వేటు వేయడానికి కూడా రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. అయితే, పోచారం శ్రీనివాస రెడ్డి శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఏం చేయాలనే యోచనలో నాదెండ్ల మనోహర్ ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+