వైయస్ జగన్‌లాంటి అవినీతిపరుడి రికార్డు నాకొద్దు: నామా

కాంగ్రెసు పార్టీ అధికార దుర్వినియోగం, జగన్ ధన మదంతో వీర్రవీగుతున్నారని అన్నారు. టిడిపి అభ్యర్థి గెలుపొందడం ఖాయమన్నారు. చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేసే వారివి చేతకాని, చేవలేని మాటలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ ఉన్నప్పుడే చంద్రబాబుపై అనేక ఫిర్యాదులు చేశారని ఏ ఒక్కటీ నిరూపించలేక పోయారన్నారు. దమ్ముంటే అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అవినీతిని ఎందుకు బయట పెట్టలేక పోయారని ప్రశ్నించారు. బెంగుళూరు, హైదరాబాదులలో ఉన్న జగన్ రెండు ఇళ్ల విలువే వందల కోట్లని చెప్పారు. అఫిడవిట్‌లో తప్పుడుగా పేర్కొన్నారని ఆరోపించారు.
కాంగ్రెసు, టిడిపి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ప్రజలను తప్పుదారి పట్టించడానికే అని మరో నేత పయ్యావుల కేశవ్ అన్నారు. కాంగ్రెసు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ రాహుకేతువుల్లాంటి వారన్నారు. జగన్ ఉప ఎన్నికల్లో రూ.200 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. జగన్ నోట్లతో గెలుస్తానని భ్రమ పడుతున్నారని అన్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత ఆయనకు ఓటర్లు బుద్ది చెప్పిన విషయం అర్థమవుతుందన్నారు. 20 సంవత్సరాలలో ఎప్పుడూ ఎన్నికలు ప్రశాంతంగా జరగలేదని, వైయస్ కుటుంబం నిత్యం రిగ్గింగ్‌కు పాల్పడిందన్నారు. ఈసారి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగితే టిడిపి ఖచ్చితంగా గెలుస్తుందన్నారు.












Click it and Unblock the Notifications