జగన్ పేరుతో పది, విజయమ్మ పేరుతో ఆరు నామినేషన్లు దాఖలు

కడప లోకసభ స్థానానికి మొత్తం 57 నామినేషన్లు దాఖలు కాగా, సోమవారం ఒక్క రోజే 36 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు క్యూ కట్టారు. పులివెందుల శాసనసభా స్థానానికి మొత్తం 36 నామినేషన్లు దాఖలు కాగా, సోమవారం ఒక్క రోజే 26 నామినేషన్లు దాఖలయ్యాయి. తెలుగుదేశం కడప లోకసభ అభ్యర్థి మైసురా రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ రెండు స్థానాల్లోనూ మూడు ప్రధాన పార్టీలు రంగంలో ఉంటున్నాయి. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు పోటీ పడుతున్నాయి.












Click it and Unblock the Notifications