హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ చేసిన పనులకు మంత్రులుగా మేమూ బాధ్యులమే: మంత్రి బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి చేసిన పనులకు మంత్రులుగా తమ బాధ్యత కూడా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. వైయస్ మంచి చేసినా, చెడు చేసినా అందులో మంత్రులుగా తమ బాధ్యత కూడా ఉందని చెప్పారు. వైయస్ హయాంలో భూకేటాయింపులపై హౌస్ కమిటీ వేయటంలో తప్పు లేదన్నారు. పారదర్శకత కోసమే హౌస్ కమిటీ వేశామని చెప్పారు.

ఉచిత విద్యుత్‌పై కేంద్రం రాసిన లేఖకు వివరణ ఇస్తామని చెప్పారు. ఉచిత విద్యుత్‌ను తప్పకుండా కొనసాగిస్తామని చెప్పారు. అధిష్టానం అనుమతి లేకుండా వైయస్ రాజశేఖరరెడ్డి ఏ పథకాన్ని అమలు చేయలేదన్నారు. కాగా కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ ఎన్నికలలో జగన్, విజయమ్మల డమ్మీ అభ్యర్థులతో తమకు సంబంధం లేదని బొత్స చెప్పారు.

English summary
Minister Botsa Satyanarayana said today that ministers also have responsibility with late YS Rajasekhar Reddy schemes. He said congress have no link with dummy candidates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X