బాబా ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ ఆందోళనకరమే: బులెటిన్
State
oi-Srinivas G
By Srinivas
అనంతపురం: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆరోగ్యంపై సిమ్స్ డాక్టర్లు మంగళవారం ఓ బులెటిన్ విడుదల చేశారు. బాబా కాలేయం ఇంకా మెరుగు పడలేదని చెప్పారు. ఇప్పటికీ వెంటిలేటర్ ద్వారానే చికిత్సను అందిస్తున్నట్టుగా చెప్పారు. సిఆర్ఆర్‌టి చికిత్స కొనసాగిస్తున్నాం అని చెప్పారు. రక్తపోటులో హెచ్చుతగ్గులు ఉన్నాయని చెప్పారు. బాబా ఆరోగ్యం ఇంకా మెరుగు పడక పోవడంతో ఆందోళన తగ్గలేదని చెప్పారు. అయినా భక్తులు భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
వైద్యుల బులెటిన్‌పై పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు విడుదల చేసే బులెటిన్‌లో బాబా ఆరోగ్యంపై డెవలప్‌మెంట్ ఏమీ చూపించడం లేదని రోజూ అదే చెబుతున్నారని అని ఆరోపిస్తున్నారు.