వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియన్ - అమెరికన్ వైద్యుడు సిద్ధార్థ ముఖర్జీకి పులిట్జర్ అవార్డు

By Pratap
|
Google Oneindia TeluguNews

Siddhartha Mukherjee
న్యూయార్క్‌: ఇండియన్ అమెరికన్ వైద్యుడు, క్యాన్సర్‌ వ్యాధి నిపుణుడు సిద్ధార్థ ముఖర్జీకి ప్రతిష్ఠాత్మక పులిట్జర్‌ బహుమతి లభించింది. ఆయన రాసిన- 'ద ఎంపరర్‌ ఆఫ్‌ ఆల్‌ మాలాడీస్‌: ఎ హిస్టరీ ఆఫ్‌ క్యాన్సర్‌' అనే పుస్తకానికి ఈ బహుమతి లభించింది. ఈ పుస్తకం డాక్టర్‌ సిద్ధార్థ తొలి రచన. హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌, ఆక్స్‌ఫర్డ్‌, స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం చేసిన సిద్ధార్థ కొలంబియా యూనివర్శిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. జనరల్‌, నాన్‌ ఫిక్షన్‌ కేటగిరిలో ఈ రచన ఎంపిక కాగా, జెన్నిఫర్‌ ఇగాన్‌ నవల 'ఎ విజిట్‌ ఫ్రమ్‌ ద గూన్‌ స్క్వాడ్‌'కి ఫిక్షన్‌ కేటగిరిలో అవార్డు లభించింది.

బ్రూస్‌ నోరిస్‌ రాసిన 'క్త్లెబోర్న్‌ పార్క్‌'కి డ్రామా ప్రైజ్‌ లభించింది. కొలంబియా యూనివర్శిటీ ప్రొఫెసర్‌ ఎరిక్‌ ఫోనర్‌ రాసిన 'ద ఫియరీ ట్రయల్‌: అబ్రహాం లింకన్‌ అండ్‌ అమెరికన్‌ స్లేవరీ'కి చరిత్రకు సంబంధించిన విభాగంలో పులిట్జర్‌ లభించింది. న్యూయార్క్‌కి చెందిన చరిత్రకారుడు చెర్నోవ్‌ 'వాషింగ్టన్‌: ఎ లైఫ్‌' అన్న పుస్తకానికి గాను జీవితచరిత్ర విభాగంలో అవార్డు గెలుచుకున్నారు. ఇక కవిత్వానికి సంబంధించిన పులిట్జర్‌ యుఎస్‌ పొయెట్‌ లారెట్‌ కే రేయాన్స్‌కి దక్కింది. జో లాంగ్‌ స్వరపరిచిన 'మదామ్‌ వైట్‌ స్నేక్‌'కి మ్యూజిక్‌ ప్రైజ్‌ లభించింది.

English summary
Indian-American physician Siddhartha Mukherjees acclaimed book on cancer, The Emperor of All Maladies: A Biography of Cancer, has won the prestigious 2011 Pulitzer prize in the general non-fiction category.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X