హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తప్పుడు సంకేతాలతో చంద్రబాబు ఇమేజ్‌ను డామేజ్ చేస్తున్న కోటరీ?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: అపర చాణక్యుడు, రాజకీయ దురంధరుడు అయిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభావం తగ్గడానికి కారణం ఆయన కోటరీయే అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన చుట్టూ ఉన్న కోటరీ తమ స్వలాభాల కోసం బాబుకు భజన చేస్తూ ఆయనను తప్పుదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటు ప్రభుత్వ వ్యవహారలతో పాటు అటు పార్టీ వ్యవహారాలు కూడా చాకచక్యంగా చూసేవారు. అయితే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబును కోటరీ తప్పుదారి పట్టిస్తున్నాయంట. తమ వ్యాపార ప్రయోజనాల కోసం చంద్రబాబును నిత్యం పొగడ్తలతో ముంచెత్తుతూ ఆయన సరియైన దారిలో వెళ్లకుండా అడ్డుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు, సుజనా చౌదరి, సిఎం రమేష్ తదితర బాబు కోటరీ విభాగమే చంద్రబాబు ఇమేజ్ డామేజ్ కావడానికి కారణంగా పలువురు భావిస్తున్నారు. రాష్ట్రంలో బలంగా ఉన్న టిడిపిని వారి వారి వ్యాపారాల అభివృద్ధి కోణంలో పయనింప జేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల హరికృష్ణ - చంద్రబాబునాయుడు మధ్య చోటు చేసుకున్న విభేదాలు కూడా అందులో భాగమేనని పలువురు భావిస్తున్నారు. కోటరీ విభాగం హరికృష్ణను బాబుకు దూరం చేయాలనే వ్యూహంతో కూడా ఉన్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల విజయవాడ కేంద్రంగా నందమూరి - నారాల మధ్య విభేదాలు అనే వార్తలు పతాక శీర్షికకు ఎక్కిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి పత్రిక ఇవ్వడానికి హరికృష్ణ స్వయంగా వెళ్లారు.

అలాంటి విషయాన్ని నందమూరి - నారా కుటుంబాల మధ్య విభేదాలు లేవని చెప్పడానికి బాగా ఉపయోగపడతాయి. అయితే అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయలేదనే ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా చంద్రబాబు ఇటీవల పాల్గొన్న ఓ కార్యక్రమాన్ని ప్రజల్లో ప్రచారం చేసుకోవడానికి మంచి అవకాశంగా ఉన్నప్పటికీ అలాంటి ప్రయత్నాలు చేయలేదని తెలుస్తోంది. చంద్రబాబుకు పార్టీ పరంగా తప్పుడు రిపోర్టులు అందిస్తూ ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు ఇటీవల వెల్లువెత్తుతున్నాయి.

English summary
It seems, TDP president Chandrababu Naidu image is damaging by his kotary. Allegations revealing that Sujana Chowdary, CM Ramesh, Nama Nageswara Rao were giving wrong indications to Chandrababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X