వైయస్ జగన్‌ను ఎదుర్కొనడానికి ఎమ్మెల్సీ పొంగులేటి కొత్త నినాదం

కడప పార్లమెంటులో జగన్‌కు ఓటు వేసినా, పులివెందుల అసెంబ్లీ నుండి విజయమ్మకు ఓటు వేసినా కర్ణాటక బిజెపిలో ఉన్న గాలికి ఓటు వేసినట్లేనని అన్నారు. జగన్ ఉప ఎన్నికల తర్వాత బిజెపితో కలవడం ఖాయమని అన్నారు. జగన్ పదవీ కాంక్ష వల్లే ఉప ఎన్నికలు వచ్చాయని అన్నారు. ఓటర్లు జగన్‌ను సమర్థవంతంగా తిప్పి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాగా మంగళవారం పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్నాటకానికి సూత్రదారి బిజెపి అని చెప్పడం విశేషం. పిసిసి అధ్యక్షుడు బిజెపి సూత్రదారి అని చెప్పగానే పొంగులేటి ఈ కొత్త నినాదాన్ని అందుకున్నాడు.












Click it and Unblock the Notifications