వైయస్ జగన్ పదవి కోసం పాకులాడుతున్నారు: రాయపాటి సాంబశివరావు

Rayapati Sambasiva Rao
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్‌పై కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు ధ్వజమెత్తారు. తమ పార్టీ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పదవులు త్యాగం చేస్తే వైయస్ జగన్ పదవి కోసం పాకులాడుతున్నారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో పోటీ సోనియాకు, వైయస్సార్‌కు మధ్యనే అని వైయస్ జగన్ అనడం మూర్ఖత్వమని ఆయన అన్నారు.

వైయస్ జగన్ తన పరిధిని మించి విమర్సలు చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. వైయస్ జగన్ వెంట వెళ్తున్న శాసనసభ్యులపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికైనా తమ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహకారంతోనే వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+