చర్యలు ఎందుకు తీసుకోవద్దు: జగన్ వర్గం ఎమ్మెల్యేలకు పిసిసి షోకాజ్

కడప పార్లమెంటు, పులివెందుల శాసనసభకు ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అతి తొందరగా జగన్ వర్గం ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని పార్టీ భావిస్తున్నట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే జగన్‌తో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వెళుతున్నప్పటికీ కేవలం నలుగురికి మాత్రమే నోటీసులు ఇచ్చి మిగిలిన వారిని దారిలోకి తెచ్చుకోవాలనే ఉద్దేశ్యంలో పార్టీ ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా పార్టీ రాష్ట్ర క్యాడర్ నలుగురి పేర్లను అధిష్టానానికి పంపింది. అయితే గురువారం అధిష్టానం నుండి చర్యలకు స్పష్టమైన ఆదేశాలు రావడంతో పిసిసి నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదిలా వుంటే, ఈ శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) తరఫున శానససభ డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కోరే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications