విండోస్ 7లో షార్ట్‌కట్‌లు ఏంటి, యమ్‌యస్ ఆఫీస్‌లో ఆటోకరెక్ట్ ఎలా వాడాలి?

మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో 'ఆటో కరెక్ట్' ఆప్షన్ తెలుసుగా? దీంతో ఇమేజ్‌లను కూడా ఇన్‌సర్ట్ చేయవచ్చు. ఉదాహరణకు డాక్యుమెంట్‌లో ఎక్కువ సార్లు కంపెనీ లోగోను పెట్టాల్పివస్తే ఆటోకరెక్ట్‌తో ఏదైనా పదాన్ని టైప్ చేసి స్పేస్ కొడితే చాలు ఇమేజ్ వచ్చేస్తుంది. logoఅని టైప్ చేసి స్పేస్ కొడితే కంపెనీ లోగో ఇన్‌సర్ట్ అవుతుందన్నమాట. అందుకు Insert-> Picture-> Clipart-> From file నుంచి ఇమేజ్‌ను డాక్యుమెంట్‌లో ఇన్‌సర్ట్ చేయండి. టూల్స్ మెనూలోకి వెళ్లి Autocorrectను సెలెక్ట్ చేసి ఆటోకరెక్ట్ ట్యాబ్‌లోకి వెళ్లాలి.Replace బాక్స్‌లో Logo పదాన్ని టైప్ చేయాలి. With బాక్స్‌లో ఇమేజ్ కనిపిస్తుంది. ఇప్పుడు Addను క్లిక్ చేసి టెక్ట్స్, లోగోను జాబితాలో పొందుపరచాలి. ఇక మీరు ఎప్పుడు Logo అని టైప్ చేసినా ఇమేజ్ వస్తుంది.












Click it and Unblock the Notifications