కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిజెపితో పొత్తు ఉండదు, కాంగ్రెసు- టిడిపి కుమ్మక్కు: జగన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప: భారతీయ జనతా పార్టీతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలవనని మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం కడప జిల్లా రోడ్ షోలో చెప్పారు. బిజెపితో జగన్ వెళతాడని కాంగ్రెసు పార్టీ కుట్రతో ప్రచారం చేస్తుందని ఆరోపించారు. తన తల్లి విజయమ్మను, తనను ఓడించడానికి కాంగ్రెసు నీతిమాలిన చర్యలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. ఉప ఎన్నికలలో తమను ఎదుర్కొనలేక అసత్య ఆరోపణలు గుప్పిస్తుందని అన్నారు. కడప జిల్లాలో వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీకి చెందిన 7వేల మంది కార్యకర్తలపై బైండోవర్ కేసులు పెట్టి వేధిస్తుందని ఆరోపించారు.

ఒకవైపు దివంగత ముఖ్యమంత్రి, తన తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఫొటో పెట్టుకుంటూనే మరోవైపు పులివెందులలో తన తల్లిపై బాబాయి వివేకానందరెడ్డిని పోటీకి దింపడం కాంగ్రెసు దిగజారుడుతనానికి నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో వస్తున్న అందరి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా కొందరిపైనే చర్యలు తీసుకోవడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తనతో వస్తున్న అందరు ఎమ్మెల్యేలపై ఒకేసారి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తనను, తన తల్లిని ఓడించడానికి కాంగ్రెసు, టిడిపి పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు.

English summary
Ex MP YS Jaganmohan Reddy clarified that he will not go with BJP. He condemned PCC chief D Srinivas comments. He blamed Congress for contesting YS Vivekananda Reddy against his mother Vijayamma.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X