తుపాకితో కాల్చి ప్రత్యర్థి హత్య: నిందితుడిని కొట్టి చంపిన బంధువులు
Districts
oi-Srinivas G
By Srinivas
నెల్లూరు: భూ తగాదాల కారణంగా ఇద్దరి మరణించిన సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. జిల్లాలోని దమదర్తి మండలం దామవరం గ్రామంలో భూ తగాదాలు ఇద్దరిని బలి తీసుకున్నాయి. తగాదాలు గత కొన్నేళ్లుగా కొనసాగుతున్నట్టు సమాచారం. అయితే శుక్రవారం అది కాస్త ముదిరి గాలి గోపాల్ అనే వ్యక్తిని ప్రత్యర్థి నాటు తుపాకీతో కాల్చాడు. దీంతో గోపాల్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఆగ్రహం చెందిన స్థానికులు కాల్చిన వ్యక్తిని పట్టుకొని బాగా చితకబాదారు. గోపాల్ బంధువులు కూడా ఆ వ్యక్తిని చితకబాదారు. అయితే ఆ దెబ్బలకు తాళలేక ఆ వ్యక్తి మరణించినట్లుగా తెలుస్తోంది.