కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిర్ణయం ఎలా ప్రకటిస్తారు: చిరంజీవికి శోభారాణి ఘాటు లేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shobha Rani
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ మాజీ మహిళా అధ్యక్షురాలు, ఆ పార్టీ సీనియర్ నాయకురాలు శోభారాణి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవికి శుక్రవారం లేఖ రాశారు. ఆ లేఖలో చిరంజీవిపై తీవ్రంగానే స్పందించారు మన ఫైర్ బ్రాండ్. పార్టీలో ఉన్న మా అభిప్రాయాలు తెలుసుకోకుండా విలీనం ప్రకటన ఎలా చేస్తారని ఆమె ప్రశ్నించారు. విలీనంపై ప్రకటన చేసే ముందు మా నిర్ణయం తీసుకునే ఆలోచన చేయక పోవడం ఏమిటని ప్రశ్నించారు.

చిరంజీవి త్వరలో ఏర్పాటు చేయనున్న విలీన సభను అడ్డుకుంటామని ఆమె లేఖలో హెచ్చరించారు. పార్టీ విలీన సభకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ వస్తే ఆమెను కూడా అడ్డుకుంటామని హెచ్చరించారు. కడప జిల్లాలో ఉప ఎన్నికల సందర్భంగా ఇప్పటికే పార్టీ క్యాడర్ మిమ్మల్ని అడ్డుకుంటుంది కదా అని గుర్తు చేశారు. అలాగే విలీన సభను కూడా అడ్డుకుంటామని హెచ్చరించారు. కాగా పార్టీ ఎమ్మెల్యేలపై చర్యలకు నిర్ణయం తీసుకుంటామని పార్టీ యోచిస్తున్న సమయంలో శోభారాణి లేఖ రాయడం విశేషం.

English summary
PRP senior Shoba Rani wrote a letter party president Chiranjeevi today about merger in congress. She warned in letter Chiranjeevi that they will obstruct AICC president Sonia Gandhi at the time of merger meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X