జగన్‌తో ఎంతమంది ఉన్నా సరే వేటు తప్పదు: వీరశివారెడ్డి

Kadapa dist map
కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో 25 మంది మాత్రమే కాదు 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా వారిపై వేటు తప్పదని కడప జిల్లా కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు వీరశివారెడ్డి శుక్రవారం ఓ టీవి కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు. జగన్‌తో ఎందరు ఉన్నా కాంగ్రెసుకు సరెండర్ కావాలని సూచించారు. లేకుంటే అందరిపైనా వేటు తప్పదన్నారు. జగన్ వర్గానికి చెందిన నలుగురిపై వేటు వేయడాన్ని ఆయన సమర్థించారు. ఇది కేవలం మొదటి విడత చర్యే అన్నారు. విడతల వారిగా వారిపై వేటుకు పార్టీ రంగం సిద్ధం చేసిందన్నారు.

రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు పేరు రెండో విడతలో ఉందన్నారు. చర్యలు తీసుకోవడం పార్టీ బాధ్యత అని చెప్పారు. తమ పని కేవలం ప్రచారం చేయడం వరకే అని అన్నారు. మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి తప్పకుండా కడప నుండి పార్లమెంటు అభ్యర్థిగా గెలుస్తారని చెప్పారు. జగన్ పార్టీ పెట్టాక ఆయన వెంట ఉన్న వారిని ఏమీ అనలేదని, అయితే పార్టీ పెట్టాకే చర్యలకు ఉపక్రమిస్తున్నామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+