సత్యసాయి మరణంతో నిరాడంబరంగా ఐపిఎల్, చీర్ గాళ్స్ లేకుండానే మ్యాచ్

కాగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబాను ప్రశాంత నిలయంలోని సాయికుల్వంత్ హాలులో బుధవారం ఉదయం సమాధి చేస్తారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి మంగళవారం సాయంత్రం వరకు భక్తుల సందర్శనార్ధం బాబా పార్థివ శరీరాన్ని ఉంచనున్నారు. అయితే వేలాదిగా తరలి వస్తున్న భక్తులతో ప్రశాంత నిలయం కిక్కిరిసి పోతోంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బాబా పార్థివ శరీరాన్ని హాస్పిటల్ నుండి ప్రశాంతి నిలయం తరలించారు. అనంతరం 6 గంటల నుండి భక్తులు చూడటానికి అనుమతి ఉంది.
అయితే ఈ లోపే భక్తులు భారీగా అక్కడకు చేరి తమకు బాబాను చూపించాలంటూ ఆందోళన చేశారు. బాబా బంధువులకు కూడా సాయి పార్థివ శరీర దర్శనం లేకపోయే సరికి వారు ప్రశాంత నిలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. రాష్ట్రవ్యాప్తంగా సాయి మండపాల్లో సాయినామం ఓంకారం మారుమ్రోగుతోంది.












Click it and Unblock the Notifications