పుట్టపర్తిలో ఆస్ట్రేలియా భక్తురాలి మృతి: తరలి వస్తున్న భక్తులు

తమ ఆరాధ్య దైవం లేరనే విషయం తెలిసి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం శెట్టిబలిజనగర్‌కు చెందిన గుత్తుల మంగమ్మ టీవీలో సాయి నిర్యాణం వార్తలు చూసి కుప్పకూలిపోయింది. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పులిపాడుకు చెందిన లక్కిరెడ్డి వెంకటరెడ్డి గుండెపోటుతో చనిపోయారు. పుట్టపర్తిలోని జెండామాను వీధిలో ఉంటున్న నారాయణమ్మ, కృష్ణా జిల్లాలోని నరసాపురానికి చెందిన పసుపులేటి రాణి కూడా మరణించారు.
కాగా సోమవారం బాబాను చూడటానికి భక్తులు లక్షలాదిగా తరలి వస్తున్నారు. ఆర్టీసీ హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులు వేయడంతో భక్తులు తరలి వస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం కూడా పుట్టపర్తికి ప్రత్యేక బస్సులు వేసింది. దక్షిణ మధ్య రైల్వే కూడా పుట్టపర్తికి రైళ్లను నడుపుతోంది.












Click it and Unblock the Notifications